Posts

Showing posts from 2017

రామాయ‌ణం గురించి చాలా మందికి తెలియ‌ని 10 విష‌యాలు ఇవే..!

Image
రామాయ‌ణం గురించి తెలియ‌నిది ఎవ‌రికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు దీని గురించి అంద‌రికీ తెలుసు. రామాయ‌ణంలో జ‌రిగిన సంఘ‌ట‌ల‌న్నీ దాదాపుగా అంద‌రికీ గుర్తే ఉంటాయి. రాముడు, సీత జ‌న‌నం ద‌గ్గ‌ర్నుంచి వారి అంత్య ద‌శ వ‌ర‌కు అందులో జ‌రిగిన ఘ‌ట్టాల‌న్నీ మ‌న‌కు క‌ళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇవ‌న్నీ కాకుండా… రామాయణం గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రామునికి ముగ్గురు త‌మ్ముళ్లు. ల‌క్ష్మ‌ణుడు, భ‌ర‌తుడు, శతృఘ్నుడు అని ఉంటారు క‌దా. అయితే వీరికి ఓ సోద‌రి కూడా ఉంటుంది. ఆమె పేరు శాంత‌.  2. రావ‌ణుడికి 10 త‌ల‌లు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే అవి అత‌నికి ఎలా వ‌చ్చాయంటే… రావ‌ణుడు గొప్ప శివ భ‌క్తుడు. శివున్ని ప్ర‌స‌న్నం చేసుకునే క్ర‌మంలో అత‌ను 10 సార్లు త‌న త‌ల‌ను అర్పిస్తాడు. అలా త‌ల‌ను అర్పించే ప్ర‌తిసారి కొత్త‌గా త‌ల పుట్టుకు వ‌స్తుంది. దీంతో అత‌నికి 10 త‌ల‌లు ఏర్ప‌డేలా శివుడు వ‌రం అనుగ్ర‌హిస్తాడు.  3. రావ‌ణుడు ప‌రిపాలించింది లంకా న‌గ‌రాన్ని అని తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావ‌ణుడి స...