addes3

Balaji

Balaji
telugu

Tracking

Monday, February 9, 2015

TNSTC Bus Timings & Fare from Chennai CMBT

TNSTC Bus Timings from Chennai


Complete list of TNSTC Buses starting from Koyembedu Bus Stand Chennai including Route Numbers, Departure time, Bus Fare and Platform Numbers.
DestinationRouteClassDeparture timeFarePlatform
Cumbam104 EFUD16:303001
Cumbam104 IJSUPER18:152251
Theni104 ABSUPER17:002251
Theni104 CDSUPER17:302251
Theni104 KLUD19:002801
Bodi104 GHA/C18:454651
Oddanchattiram3 CDUD19:302551
Dindigul3 ABA/C20:003801
Madurai202 ACA/C19:254002
Madurai202UD20:452552
Madurai202 ACA/C20:554002
Tirumangalam202 TUD19:452752
Usilampatti202 ACA/C20:004302
Usilampatti202 UUD20:302752
Aruppukottai441 ACA/C18:004552
Aruppukottai441 UDUD19:152852
Sivakasi515 ACA/C18:504752
Thenkasi777 SDSUPER15:302651
Tiruchendur333 ADSUPER15:502651
Tiruchendur333 ADA/C17:505551
Tirunelveli333 ACA/C16:005451
Tirunelveli333 UDUD17:303401
Papanasam333 UDUD16:103701
Tuticorin333 UDUD16:503301
Tuticorin333 ACA/C17:205151
Karungal555 UDUD14:203951
Colachel555 UDUD14:403951
Kanyakumari555 ACA/C15:006251
Kollancode555 UDUD15:204051
Marthandam555 UDUD15:403951
Kulasekharam555 UDUD16:004001
Nagercoil555 SSUPER16:202901
Nagercoil555 ACA/C16:406051
Thisayanvilai555 UDUD16:303701
Thuckkalay555 SSUPER17:002901
Adiramapattinam242 RUD08:15, 19:302152
Kumbakonam201UD05:00, 10:30, 17:30, 23:301702
Kumbakonam182 AORDY21:201052
Mannarkudi246UD07:15, 09:351902
Pattukottai242 07:45, 20:302202
Thanjavur241UD11:00, 11:30, 21:20, 23:001952
Thanjavur380ORDY09:00, 22:001202
Thiruvarur245UD07:00, 10:00, 22:151902
Trichy908UD00:15, 05:50, 07:20, 08:30,1901
Trichy908UD08:50, 09:30, 18:15, 19:30,1901
Trichy908UD20:40, 21:20, 22:50, 23:101901
Aranthangi425 AUD20:002352
Karaikudi170 EUDUD21:002402
Pudukottai225 KUD21:152152
Coimbatore858 ACA/C21:004603
Coimbatore858 ACA/C22:004603
Guddalur1719 UDUD16:303403
Metupalayam870 UDUD18:153003
Ooty1718 UDUD17:453353
Pollachi1745 UDUD18:003001
Pollachi859 ACA/C20:004401
Anthiyur40723 UDUD18:302553
Dharapuram48902 UDUD19:002701
Erode40752 ACA/C22:153803
Gobi40705 UDUD18:302553
Sathy40709-OORDY20:001653
Tiruppur40721 UDUD20:452603
Tiruppur40754 ACA/C21:154303
Salem (via Velur)1228UD07:30, 08:302053
Salem (via Villupuram)1062UD07:45, 08:15, 09:44, 11:00,2003
Salem (via Villupuram)1062UD21:002003
Salem (via Villupuram)1063UD08:252003
Mettur1062 KUD08:10, 21:002154
Mettur175 AUD21:302154
Hosur475UD07:45, 08:15, 09:00, 10:00,1904
Hosur475UD11:00, 21:45, 22:451904
Hosur303 UDUD22:00, 23:001854
Dharmapuri175 BUD07:301804
Dharmapuri272SEMI21:10, 21:501154
Dharmapuri275SEMI11:351104
VelloreACVolvo06:00, 07:00, 08:00, 09:00,
   11:00, 13:00, 14:00, 15:00,  
   16:00, 17:00, 19:00, 21:00  
Note: We sincerely hope you got the information that you are looking for. If you are aware of any return journey bus route numbers from your place to Chennai, departure timings you can inform us through the comments below.

Thursday, February 5, 2015

Alagar Temple Information

Alagar Temple Information - అళగర్ కొయిల్
మనం మధురై లో ఉన్నాం కదా ! .. మధురై అమ్మవార్ని దర్శనం చేస్కున్నాక మనం చుడవాల్సిన టెంపుల్స్ ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన “ ఆరు పడై వీడు ” లో పళముదిర్చోళై , తిరుప్పరంకుండ్రం ,పళని ఈ మూడు క్షేత్రాలను మనం చూడబోతున్నాం . పళని మదురై నుంచి 120km అందుకనే మనం ముందుగా  పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూస్కుని తరువాత పళని బయలుదేరుతాం . 


 మీకు గుర్తుందా అమ్మవారి టెంపుల్ కి ఎలా వచ్చామో .. రైల్వే స్టేషన్ లో దిగి కుడివైపు కి నడుకుంటూ వచ్చి . ఎడమవైపుకి తిరిగి డైరెక్ట్ గా వెళ్తే అమ్మవారి గుడికి వెళ్ళాం కదా .. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి కుడివైపుకి వెళ్తే డైరెక్ట్ గా మనం బస్సు స్టాండ్ కి వెళ్తాం . ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే .



మీకు నేను మనం రెండు క్షేత్రాలు చూద్దామని చెప్పను కదా ! పళని ముడొవది పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూడబోతున్నాం అన్నాను కదా అప్పుడే మర్చిపోతే ఎలా ? అక్కడ రెండు బస్సు స్టాండ్ లు ఉంటాయ్ . ఒకటే పళముదిర్చోళై వెళ్ళేది రెండవది తిరుప్పరంకుండ్రంవైపు వెళ్ళేది రెండు ప్రక్కపక్కనే . ఇప్పుడు మనం పళముదిర్చోళై వేల్లబోతున్నాం . 

 టికెట్ తీస్కునే టప్పుడు 50/- టికెట్ తీస్కోండి . ఒక రోజు మెత్తం బస్సు టికెట్ తిస్కోవాల్సిన అవసరం ఉండదు . రెండు క్షేత్రాలను 50/- తో చూసిరావచ్చు . పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉంటారు .

ఇక్కడ మనం కొండ క్రింద  శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటైన అలగర్ టెంపుల్ ని చూడబోతున్నాం . నాకు తెలుసు మీరు బస్సు దిగడం దూరంనుంచి టెంపుల్ చూడ్డం కూడా జరిగింది అని .
స్వామి వార్ని చూసారా ? నా అజ్ఞా లేకుండా నా దర్శనం చేయగలరా అన్నట్టు ఎలా చూస్తున్నారో . 


 ఇక్కడ టెంపుల్ లో మనం ఎక్కడ చూడనటువంటి విధంగా స్వామివారు మనకు దర్శనం ఇస్తారు . స్వామి వారు నడుము దగ్గర ఒక కత్తి ఉంటుంది .

 రండి అక్కడే ఉండిపోయరేం టెంపుల్ చూడండి .. టెంపుల్ చాల పెద్దది .

 మనం కనిపిస్తుంది కదా ఆ లోపాలకి వెళ్ళాలి .. 



 చెప్పా కదా టెంపుల్ పెద్దది అని .. స్వామి టెంపుల్ తో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయ్ ..


 నేను మీకు చెప్పాకదా .. స్వామి వారి నడుం కి కత్తి ఉంటుంది అని .. ఇక్కడ వారు దానికి పూజలు చేస్తూ ఉంటారు .

 స్థలపురాణం తెలిస్తే బాగున్నాను .. మీకు తెలిస్తే చెప్పండి ..


రాములవారి గుడి





ఇప్పుడు మనం బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాలి .. బస్సు వచ్చేవరకు వెయిట్ చేయండి ..  ఈ లోపు తిరుత్తణ్ణి చూసిరండి . 

Teerthams in Tirumala/Tirupati

తిరుమలలో ముఖ్యతీర్థాలు ............


1. పాండవ తీర్థము : కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది. 

2. సనకసనందన తీర్థము : సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది. 

3. కుమారధారా తీర్థము : మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది

4. తుంబుర తీర్థము : ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు. 

5. నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. 

6. చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

7. జాబాలి తీర్థము : ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.

8. బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు. 

9. వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

10. శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది. 

11. సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు. 


12. యుద్ధగళ తీర్థము : ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు

13. విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. 

14. పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.
 
design by: amdg