addes3

Balaji

Balaji
telugu

Tracking

Thursday, February 5, 2015

Alagar Temple Information

Alagar Temple Information - అళగర్ కొయిల్
మనం మధురై లో ఉన్నాం కదా ! .. మధురై అమ్మవార్ని దర్శనం చేస్కున్నాక మనం చుడవాల్సిన టెంపుల్స్ ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన “ ఆరు పడై వీడు ” లో పళముదిర్చోళై , తిరుప్పరంకుండ్రం ,పళని ఈ మూడు క్షేత్రాలను మనం చూడబోతున్నాం . పళని మదురై నుంచి 120km అందుకనే మనం ముందుగా  పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూస్కుని తరువాత పళని బయలుదేరుతాం . 


 మీకు గుర్తుందా అమ్మవారి టెంపుల్ కి ఎలా వచ్చామో .. రైల్వే స్టేషన్ లో దిగి కుడివైపు కి నడుకుంటూ వచ్చి . ఎడమవైపుకి తిరిగి డైరెక్ట్ గా వెళ్తే అమ్మవారి గుడికి వెళ్ళాం కదా .. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి కుడివైపుకి వెళ్తే డైరెక్ట్ గా మనం బస్సు స్టాండ్ కి వెళ్తాం . ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే .



మీకు నేను మనం రెండు క్షేత్రాలు చూద్దామని చెప్పను కదా ! పళని ముడొవది పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూడబోతున్నాం అన్నాను కదా అప్పుడే మర్చిపోతే ఎలా ? అక్కడ రెండు బస్సు స్టాండ్ లు ఉంటాయ్ . ఒకటే పళముదిర్చోళై వెళ్ళేది రెండవది తిరుప్పరంకుండ్రంవైపు వెళ్ళేది రెండు ప్రక్కపక్కనే . ఇప్పుడు మనం పళముదిర్చోళై వేల్లబోతున్నాం . 

 టికెట్ తీస్కునే టప్పుడు 50/- టికెట్ తీస్కోండి . ఒక రోజు మెత్తం బస్సు టికెట్ తిస్కోవాల్సిన అవసరం ఉండదు . రెండు క్షేత్రాలను 50/- తో చూసిరావచ్చు . పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉంటారు .

ఇక్కడ మనం కొండ క్రింద  శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటైన అలగర్ టెంపుల్ ని చూడబోతున్నాం . నాకు తెలుసు మీరు బస్సు దిగడం దూరంనుంచి టెంపుల్ చూడ్డం కూడా జరిగింది అని .
స్వామి వార్ని చూసారా ? నా అజ్ఞా లేకుండా నా దర్శనం చేయగలరా అన్నట్టు ఎలా చూస్తున్నారో . 


 ఇక్కడ టెంపుల్ లో మనం ఎక్కడ చూడనటువంటి విధంగా స్వామివారు మనకు దర్శనం ఇస్తారు . స్వామి వారు నడుము దగ్గర ఒక కత్తి ఉంటుంది .

 రండి అక్కడే ఉండిపోయరేం టెంపుల్ చూడండి .. టెంపుల్ చాల పెద్దది .

 మనం కనిపిస్తుంది కదా ఆ లోపాలకి వెళ్ళాలి .. 



 చెప్పా కదా టెంపుల్ పెద్దది అని .. స్వామి టెంపుల్ తో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయ్ ..


 నేను మీకు చెప్పాకదా .. స్వామి వారి నడుం కి కత్తి ఉంటుంది అని .. ఇక్కడ వారు దానికి పూజలు చేస్తూ ఉంటారు .

 స్థలపురాణం తెలిస్తే బాగున్నాను .. మీకు తెలిస్తే చెప్పండి ..


రాములవారి గుడి





ఇప్పుడు మనం బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాలి .. బస్సు వచ్చేవరకు వెయిట్ చేయండి ..  ఈ లోపు తిరుత్తణ్ణి చూసిరండి . 

No comments:

 
design by: amdg